నవగ్రహ మంగళహారతి : దంపతులకు ఆశీర్వాదం ఈ మంగళహారతి

 

శ్రీ సర్వేశ్వర వరతనయూడు తేజస్కాముడు సిద్ధి బుద్ధి సంయుక్తుడు ఆశ్రిత వరదుడు

గజముఖ ధరుడు గణనాయకుడు మూషికవాహన మోదకహస్తుడు

గ్రహం గణపతి రక్షించు ఈ దంపతులను 

1.హంస వాహనుడభ్యాసనుడు నారాయణసుతుడు

పాణి తలమున వీణ కలిగిన వాణి విభుడు

వేదజనకుడు వేదాతీతుడు వేదాంతార్ధ విచారపరుడు

బ్రహ్మదేవుడు రక్షించు ఈ దంపతులను


2. లక్ష్మీ సహితుడు నిక్షేపాజ్ఞుడు పక్షి వాహనుడు 

పాతక సంహారుడు పీతాంబరధరుడు

అహల్యశాప విమోచన పరుడు అక్షయమొసగిన ఆదిదేవుడు 

శ్రీ మహావిష్ణువు రక్షించు ఈ దంపతులను


3.పార్వతి సహితుడు పన్నగధరుడు ఫాలనేత్రుడు 

గౌరీయుతుడు గంగాధరుడు గజ చర్మాంబరుడు

కరిముఖ జనకుడు గరళాగ్రీవుడు  కైలాసాద్రి నివాసుండెపుడు 

సాంబమూర్తి రక్షించు ఈ దంపతులను 


4.రక్తవస్తువా ప్రీతికరుండు రక్తాంబరధరుడు

రక్తాగాత్ర ఋగ్వేదుడు రాచకార్యుడు

పదిమూడారిట ఫలదాయకుడు పంచమిరాశిన నివసించేటి

సూర్యగ్రహము రక్షించు ఈ దంపతులను


5.తెల్లని గంధం తెల్లని మేను తేజస్కాముడు

రోహిణి హితుడు రాత్రీశ్వరుడు రూఢీగా ఇతడు

మూడుపదారిట ముని జన్మాన ముఖ్యుండితడు కర్కటకేశుడు

చంద్రగ్రహము రక్షించు ఈ దంపతులను


6.మేదిని సుతుడు మేషాధీశుడు మేధాతీతుడు

పదకొండింటను మూడారింటను పాలించెడివాడు

హాటకధాన్య మోహనపరుడు అగ్నిహోత్రునకనుకూలుండు 

అంగారకుడు రక్షించు ఈ దంపతులను


7.అప్రకాశుడు ఆదిత్యాత్ముడు అత్యంతోత్తముడూ

కన్యామిథునా రాశుల యందు కాంక్షత కలవాడూ

ఎనిమిది నాలుగు పదిరెండింటను ఎప్పటికీ ఘనదాయకుడితడు

బుధ గ్రహము రక్షించు ఈ దంపతులను


8.మీనధనస్సులాధారముగా మేదిని లోపలనూ 

తొమ్మిది రెండేడింటైదు తొలుతగ ఫలమిచ్చు 

ఋగ్వేదోక్తుడు లోకాతీతుడు ప్రీతిక ద్రవ్య ప్రీతికరుండు 

గురుగ్రహము రక్షించు ఈ దంపతులను


9.వృషతుల రాశుల రెండింటాను విహరించెడివాడు

భార్గవ సుతుడు దానవ గురుడు ప్రఖ్యాతైనాడు

ఆరేడుపది అవి మూడు గాకను ధనములొసంగిన ధవళశరీరుడు

శుక్రగ్రహము రక్షించు ఈ దంపతులను


10.మందగమనుడూ మలినశరీరుడు మలినాంబరధరుడూ

ఆర్మూడింటను అనుకూలుండు ఆయుష్కారకుడూ

కుంభమృగాదుల కోరిన విభుడు ఛాయాసుతుడు సాయకధరుడు

శనిగ్రహము రక్షించు ఈ దంపతులను


11.కృష్ణవర్ణుడూ కృష్ణశరీరుడు కృష్ణాంబరధరుడూ

సృష్టీరతుడు నిష్టాపరుడు శ్రేష్ఠుడు ఈతాడూ

త్రిగుణస్థానము నందున శుకుడు వృషనీపతుల కులదాసనుడు

రాహుగ్రహము రక్షించూ ఈ దంపతులనూ


12. చిత్రవర్ణుడు చిత్రశరీరుడు చిత్రాంబరధరుడూ

చిత్రాగుప్తాదులతోడాను మైత్రీ కలవాడూ

మహిషాసనుడూ మన్మధమిత్రుడు మూడారింటను ముఖ్యుండితడు

కేతు గ్రహము రక్షించూ ఈ దంపతులను


13.ఆశించెవవ్వరు నవగ్రహ మంగళహారతి పాడిననూ 

కాశీయాత్రా చేసిన ఫలము కలుగుటె కాకుండా 

వాశిగ వారాణాసిగ సుబ్బయ్య పోషక హృదయ నివాసుండెప్పుడు 

శ్రీశైలేశ్వర పదసన్నిధికి చేరుదులెల్లపుడూ...