ఏప్రిల్ 16న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసం

టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో  ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు  ఏప్రిల్ 16వ తేదీ గురువారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 5.30 గంటలకు ధార్మికోపన్యాసం చేయనున్నారు.

ఈ సందర్భంగా ఆయన “నిత్య జీవితంలో ధర్మాచరణం” అనే అంశంపై  ధార్మికోపన్యాసం ఇవ్వనున్నారు. 

భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవలసిందిగా టీటీడీ కోరుతోంది.