భక్తుల పూజలందుకుంటున్న 900 ఏళ్ళ వృక్షం

ఇది కేవలం చెట్టుకాదు. కేరళలో ఇది ఓ దేవత. దాన్ని వృక్షమాత అని పిలుచుకుంటారు. ఈ వృక్షము వయసు 900 ఏళ్ళ పైమాటే. కేరళలోని కన్నూరు జిల్లాలోని తెలిపరంబ పట్టణంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర ఆలయం ఆవరణలో ఉంది ఈ పవిత్ర క్షేత్రం. 

కేవలం ఇది ఒకే వృక్షం కాదు5 రకాల వృక్షరాజాల కలయిక. ‘‘మదర్ ట్రీ ఏడాకుల పాల చెట్టు. దీన్ని బ్లాక్ బోర్డు ట్రీ, డెవిల్స్ ట్రీ, మిల్క్ ఉడ్ ట్రీ అని పిలుస్తారు. ఈ ఏడాకులపాల చెట్టులో మేడి చెట్టు, నల్ల తుమ్మ, బోధివృక్షం అదే రావి చెట్టు, దంతపాల, మర్రి చెట్టు కలగలసి 900 సంవత్సరాలుగా కలిసి పెరుగుతున్నాయి. 

దీనిని 2011 లో కేరళ అటవీశాఖ ‘‘గ్రాండ్ మదర్ ఆఫ్ ట్రీస్’’ అని నామకరణం చేసారు. దీనినే స్థానికులు ‘‘వృక్షమాత’’ అని భక్తితో పిలుచుకుంటారు. దీనిని కేవలం ఓ చెట్టుగా చూడవద్దని అక్కడే ఉన్న ఈ వృక్షాన్ని ఓ దేవిగా, మాతగా ఆరాధించి, పూజించి, గౌరవించాలని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. మీరూ కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లాకు వెళ్ళినపుడు ఈ వృక్షమాతను దర్శించుకోండి.