సంక్రాంతి సంబరాల్లో భాగంగా కన్నెపిల్లలందరూ చేరి గొబ్బెమ్మల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ పాటలు పాడుతారు.
జోలపాడారమ్మ అంగనామణులు
మా బాలుని చేరి మధురగీతాల
జోలపాడారమ్మ అంగనామణులు
మా బాలుని చేరి మధురగీతాల
చెంపకు చారెడు కనులున్నవాడు
శిఖిపింఛమౌళితో చెలువొందువాడు
బోసి నవ్వులతో కవ్వించువాడు
ఫణిరాజు శయ్యపై పవ్వళిస్తాడు
జోలపాడారమ్మ అంగనామణులు
మా బాలుని చేరి మధురగీతాల
కౌస్తుభహారంపు వక్షస్థలముతో
రాకేందుముఖముతో రమ్యకాంతులతో
చిలిపిచేష్టలతో నవ్వుతున్నాడు
అల్లారుముద్దుగా మురిపించువాడు
జోలపాడారమ్మ అంగనామణులు
మా బాలుని చేరి మధురగీతాల
వ్రేపల్లెవాడలో గోపాలుడమ్మ
వెన్నముద్దలతోను మురిసిపోతాడు
గోవత్సములతో ఆడుకొంటాడు
గోపబాలురతో చెలిమిచేస్తాడు
జోలపాడారమ్మ అంగనామణులు
మా బాలుని చేరి మధురగీతాల
జోలపాడారమ్మ అంగనామణులు
మా బాలుని చేరి మధురగీతాల
మా బాలుని చేరి మధురగీతాల