సంక్రాంతి సంబరాల్లో భాగంగా కన్నెపిల్లలు అంతా ఒకచోటచేరి పాడుకునే గొబ్బిళ్ళపాటలు.
పౌష్యలక్ష్మికి గొబ్బిళ్ళు
ధనధాన్యాలకు గొబ్బిళ్ళు ||2||
మకరసంక్రాంతి మా వందనం
శుభశోభితాంగి అభివందనం ||పౌష్యలక్ష్మి||
భోగిమంటల కోలాహలం
వెచ్చనికాంతుల విన్యాసము ||పౌష్యలక్ష్మి||
ప్రవిమలమైన పర్వదినం
సంక్రాంతిభాతి సంతోషము ||2||
ఉత్తరాయణం ప్రారంభము
ఉజ్జ్వలమైన భవితవ్యం ||2|| పౌష్యలక్ష్మి||
దానధర్మముల జనతృప్తి
పశుపక్ష్యాదుల పరితుష్టి ||2||
జానపదకళ జాగారము
వినోదవిశ్రుతి ప్రమోదము ||2|| పౌష్యలక్ష్మి||
పితృదేవతల ఆరాధన
విశ్వశాంతికి నివేదన ||2|| పౌష్యలక్ష్మి||
సుందరప్రకృతి శుభోదయం
మానవాళికి మహోదయం ||2|| పౌష్యలక్ష్మి||
పౌష్యలక్ష్మికి గొబ్బిళ్ళు
ధనధాన్యాలకు గొబ్బిళ్ళు
ధనధాన్యాలకు గొబ్బిళ్ళు