విఘ్నాలనరికట్టే విఘ్నేశ్వరుడా
శుభము ప్రసాదించు శుక్లవర్ణుడా
విఘ్నాలనరికట్టే విఘ్నేశ్వరుడా
శుభము ప్రసాదించు శుక్లవర్ణుడా
ముంగిట్లో చక్కని రంగవల్లులు
గోమయంబుతోడ గొబ్బిళమ్మలు
ముంగిట్లో చక్కని రంగవల్లులు
గోమయంబుతోడ గొబ్బిళమ్మలు
ముద్దబంతిపూలు మురియుచుండగ
స్వాగతంబు నీకు ఆగమవినుత
ముద్దబంతిపూలు మురియుచుండగ
స్వాగతంబు నీకు ఆగమవినుత
విఘ్నాలనరికట్టే విఘ్నేశ్వరుడా
శుభము ప్రసాదించు శుక్లవర్ణుడా
ప్రసన్నవదనుండ పార్వతీ సుతుడ
ప్రణవాకారుండ ప్రవిమలతేజ
ప్రసన్నవదనుండ పార్వతీ సుతుడ
ప్రణవాకారుండ ప్రవిమలతేజ
వక్రతుండా నీకు వందనశతము
అర్చింతుమయ్య అమరేంద్రవంద్య
వక్రతుండా నీకు వందనశతము
అర్చింతుమయ్య అమరేంద్రవంద్య
విఘ్నాలనరికట్టే విఘ్నేశ్వరుడా
శుభము ప్రసాదించు శుక్లవర్ణుడా
గొబ్బిళ్ళతో నీకు గుజ్జురూపుడ
కన్నెలు పాటలతో సన్నుతింపగ
గొబ్బిళ్ళతో నీకు గుజ్జురూపుడ
కన్నెలు పాటలతో సన్నుతింపగ
సర్వదా కృపజూపి శంకరతనయ
సర్వవిద్యలొసగి సాకుము స్వామి
సర్వదా కృపజూపి శంకరతనయ
సర్వవిద్యలొసగి సాకుము స్వామి
విఘ్నాలనరికట్టే విఘ్నేశ్వరుడా
శుభము ప్రసాదించు శుక్లవర్ణుడా
విఘ్నాలనరికట్టే విఘ్నేశ్వరుడా
శుభము ప్రసాదించు శుక్లవర్ణుడా
శుభము ప్రసాదించు శుక్లవర్ణుడా
శుభము ప్రసాదించు శుక్లవర్ణుడా