దేవీ నవరాత్రులు 2025: బ్రహ్మచారిణి దేవి స్తోత్రాలు

నవదుర్గలు అంటే దుర్గా దేవి యొక్క తొమ్మిది అవతారాలు. అవి: శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. దేవీ నవరాత్రుల్లో రెండవరోజున దుర్గామాత మనకు బ్రహ్మచారిణీదేవి అవతారంలో సాక్షాత్కరిస్తుంది. బ్రహ్మచారిణి మాతను ఈ స్తోత్రాలతో కీర్తిస్తే దేవి అనుగ్రహం లభిస్తుంది. 

బ్రహ్మచారిణి మంత్రం

ఓం దేవి బ్రహ్మచారిణ్యై నమః॥

బ్రహ్మచారిణి ప్రార్థన

దధాన కర పద్మాభ్య అక్షమాల కమండలూ

దేవీ ప్రసీదతు మయీ బ్రహ్మచారిణ్యనుత్తమా॥


వందేవాంఛిత లాభాయ చంద్రర్ధకృతశేఖరాం

జపమాలా కమండలూ ధర బ్రహ్మచారిణీ శుభామ్ ॥


గౌరవర్ణా స్వాధిష్ఠానా స్థితాం ద్వితీయ దుర్గా త్రినేత్రాం 

ధవళ పరిధానం బ్రహ్మరూపాం పుష్పాలంకారభూషితాం ॥


పద్మవందనా పల్లవారాధరా కాంతంకపోలాం పీన పయోధరాం

కమనీయాం లావణ్యాం స్మేరముఖి నిమ్ననాభి నితంబనీం

బ్రహ్మచారిణి స్తుతి

యా దేవీ సర్వభూతేషు మా బ్రహ్మచారిణీ రూపేణ సంస్థితా ।

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః॥

బ్రహ్మచారిణి స్తోత్ర

తపశ్చారిణీ త్వమ్హి తాపత్రయ నివారణీమ్ ।

బ్రహ్మరూపధరా బ్రహ్మచారిణీ ప్రణమామ్యహమ్॥


నవచక్రభేదనీ త్వంహి నవ ఐశ్వర్యప్రదాయినీం

ధనదా సుఖదా బ్రహ్మచారిణీ ప్రణమామ్యహం॥


శంకరప్రియా త్వమ్హీ భుక్తి-ముక్తి దాయినీ.

శాంతిదా మానదా బ్రహ్మచారిణీ ప్రణమామ్యహం