దేవీ నవరాత్రులు 2025: చంద్రఘంటా దేవి స్తోత్రాలు

నవదుర్గలు అంటే దుర్గా దేవి యొక్క తొమ్మిది అవతారాలు. అవి: శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. దేవీ నవరాత్రుల్లో మూడవరోజు దుర్గమ్మ తల్లి మనకు చంద్రఘంటాదేవి అలంకారంలో దర్శనమిస్తుంది. చంద్రఘంటాదేవిని ఈ శ్లోకాలతో కీర్తిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. 

చంద్రఘంట మంత్రం:

ఓం శ్రీ దేవీ చంద్రఘంటాయై నమః

చంద్రఘంట ప్రార్థన

పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా |

ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా

చంద్రఘంట ధ్యానం

వందేవాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరాం

సింహారూఢా చంద్రఘంటా యశశ్వినీమ్


మణిపుర స్థితం తృతీయ దుర్గా త్రినేత్రం 

ఖడ్గ గదా త్రిశూల చాపశర పద్మ కమండలూ మాలా వరాభీతకరాం


పీతాంబర పరిధానాం మృదుహాస్య నానాలంకారభూషితాం

మంజీరహార కేయూర కింకిణీ రత్నకుండలమండితాం


ప్రఫుల్లవదనా బింబాధరాకాంతం కపోలాం తుగాంకుచాం

కమనీయం లావణ్యాం క్షీణకటి నితంబనీమ్ 

చంద్రఘంట స్తుతి

ఆపదుద్ధారిణీ త్వమ్హీ ఆద్యా శక్తిః శుభపరాం ।

అణిమాది సిద్ధిదాత్రీ చంద్రఘంటా ప్రణమామ్యహం॥


చంద్రముఖీ ఇష్ట దాత్రీ చంద్ర మంత్ర స్వరూపిణీమ్ ।

ధనదాత్రీ, ఆనందదాత్రీ చంద్రఘంటే ప్రణమామ్యహం॥


నానారూపధారిణీ ఇచ్ఛామయీ ఐశ్వర్యదాయినీమ్ ।

సౌభాగ్యారోగ్యదాయినీ చంద్రఘంటే ప్రణమామ్యహం॥


ఇతి శ్రీ చంద్రఘంటా  స్తోత్రం |