
నవదుర్గలు అంటే దుర్గా దేవి యొక్క తొమ్మిది అవతారాలు. అవి: శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. దేవీ నవరాత్రుల్లో దుర్గమ్మ మొదటిరోజు శైలపుత్రి అవతారంలో దర్శనమిస్తుంది. ఆ తల్లిని ఈ స్తోత్రాలతో కీర్తిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది.
శైలపుత్రీ మంత్రం
ఓం దేవీ శైలపుత్రియై నమః ||
శైలపుత్రీ ప్రార్థన
వందే వాంఛితాలాభాయ చంద్రార్ధకృతశేఖరం
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ||
శైలపుత్రీ స్తుతి
యా దేవీ సర్వభూతేషు శైలపుత్రి రూపేణ సంస్థితాః
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||
శైలపుత్రీ ధ్యానం
పూర్ణేందు నిభాం గౌరీ మూలాధార స్థితాం ప్రథమ దుర్గ త్రినేత్రాం
పీతాంబర పరిధానాం రత్నకిరీట నామాలంకార భూషితాం ||
ప్రఫుల్ల వందనా పల్లవాధరాం కాంతంకపోలాం తుగ కుచాం
కమనీయాం లావణ్యాం స్నేముఖి క్షీణమధ్యాం నితంబనీమ్ ||
శైలపుత్రీ స్తోత్రం
ప్రథమ దుర్గా త్వంహి భవసాగరః తారణీం
ధన ఐశ్వర్య దాయిని శైలపుత్రి ప్రణమామ్యహం ||
త్రిలోకజననీ త్వంహి పరమానంద ప్రదీయమాన్
సౌభాగ్యారోగ్య దాయిని శైలపుత్రి ప్రణమామ్యహం ||
చరాచరేశ్వరి త్వంహి మహామోహ వినాశినీం
ముక్తి భుక్తి దాయనీం శైలపుత్రి ప్రణమామ్యహం ||