హంస వాహనంపై శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి అభ‌యం

 

తిరుప‌తి శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల్లో మొద‌టి రోజైన బుధ‌వారం రాత్రి ఏడుగంటల నుండి హంస వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు. గ‌జ‌రాజులు ముందు న‌డుస్తుండ‌గా క‌ళాబృందాల కోలాటాలు, భ‌జ‌నల న‌డుమ వాహ‌న‌సేవ కోలాహ‌లంగా జ‌రిగింది. భ‌క్తులు అడుగ‌డుగునా క‌ర్పూర‌హార‌తులు స‌మ‌ర్పించారు.

ఆది దంపతులైన స్వామి, అమ్మవార్లు హంస మిథునం(దంపతులు)లా గోచరిస్తారు. వారి వల్లనే అష్టాదశ విద్యలు పరిణమించాయి. పాలను, నీటిని వేరు చేసే వివేకం అలవడుతుంది. కపిలాది యోగీశ్వరుల మానస సరస్సులో హంస జంటగా స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తున్నారు.