శివరాత్రి నాడు శివుని స్మరిస్తే చాలు...


శివుడు అంటే మంగళకరమైన వాడు అని అర్థం. శివరాత్రి అంటే శుభప్రదమైన రాత్రి అని చెబుతారు. పరమశివుడు జ్యోతిర్లింగ రూపునిగా ఆవిర్భవించిన పరమ పవిత్రదినం మహాశివరాత్రి.  ఆనంద తాండవం చేసే రాత్రే శివరాత్రి. అందుకే ఈరోజున రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చేయాలని పురాణాలు చెబుతున్నాయి.

సంవత్సరంలో ఎప్పుడూ శివుని తలవని వారు కూడా ఈ ఒక్కరోజు శ్రద్ధాభక్తులతో పరమేశ్వరుని అర్చిస్తే సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుందంటారు పెద్దలు. అందుకే ‘జన్మానికో శివరాత్రి’ అనే సామెత పుట్టింది. శివుడు భోళా శంకరుడు. అందుకే మహాశివరాత్రి నాడు మనం శివుని అర్చించలేకపోయినా సరే ఆయన నామాన్ని మనసారా స్మరిస్తే చాలు మనల్ని అనుగ్రహిస్తాడు.