రెండో ఝాములో పెరుగుతో అభిషేకించి, తులసీదళాలతో పూజించి, పాయసాన్ని నివేదించాలి. మూడవ ఝాములో నేతితో అభిషేకించి, మారేడు దళాలతో పూజించి, నువ్వులతో వండినపదార్థాన్ని నైవేద్యం పెట్టాలి. నాలుగవ ఝాములో తేనెతో అభిషేకించి పుష్పాలతో పూజించి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
ఇలా అన్నిఝాములలో అన్ని పదార్థాలను నివేదించలేని వారు. ఇంట్లో ఒక పళ్లెంలో శివలింగాన్ని ప్రతిష్టింప చేసుకుని దాన్ని జలంతో అభిషేకిస్తూ మారేడు దళాలు సమర్పిస్తే చాలు పరమేశ్వరుడు సంతృప్తిచెందుతాడు. ఇలా పూజించడంతో పాటుగా లింగోద్భవ సమయంలో అంటే అర్ధరాత్రి శివునికి పూజలు చేయడంతోపాటు శివనామస్మరణంతో రాత్రంతా జాగరణ చేయాలి. మరుసటిరోజు తిరిగి శివపూజలు చేసి నైవేద్యం సమర్పించి, భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలి. ఈ మహాపర్వదినాన పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం జరిపించడం పూర్వకాలం నుండి ఆచారంగా వస్తోంది.