శ్రీ పురందరదాస విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

 

దాససాహిత్య పితామహుడు శ్రీ పురందరదాస ఆరాధనా మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఉద‌యం అలిపిరి వద్ద గల శ్రీ పురందరదాసుల విగ్రహనికి పలువురు ఘ‌నంగా పుష్పాంజలి ఘటించారు.

ముందుగా భజనమండళ్ల సభ్యులు భ‌జ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు, ఇతర ఆధికారులు, భక్తులు పాల్గొన్నారు.