సర్వభూపాల వాహనంపై పాండురంగ స్వామి అలంకారంలో గోవిందుడు

 

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం రాత్రి స్వామి వారు పాండురంగ స్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులను కటాక్షించారు.

రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

సర్వభూపాల వాహ‌నం – య‌శోప్రాప్తి 

సర్వభూపాల అంటే రాజులందరు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు.

వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.