శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు శ్రీవారి సారె

తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సారె పంపారు. శనివారం సాయంత్రం శ్రీవారి ఆలయ అధికారులు శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీ గంగమ్మ గుడికి వెళ్ళి సారె అందజేశారు.

తిరుప‌తి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సోదరిగా చెబుతారు. జాతర సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి గంగమ్మ తల్లికి సారె సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది.