తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం సూర్యప్రభవాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంలో మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 10 నుండి 11 గంటల వరకు సూర్యప్రభవాహనంపై శ్రీ కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.