అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు

తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో శ‌నివారం ఉద‌యం ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయిన శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలుఅంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 

బ్ర‌హ్మోత్స‌వాల్లో ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌రకు, రాత్రి 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వహిస్తున్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు 

తేదీ

11-02-2024

ఉదయం – శేష వాహనం                           రాత్రి – హంస వాహనం

12-02-2024

ఉదయం – ముత్యపుపందిరి వాహనం     రాత్రి – సింహవాహనం

13-02-2024

ఉదయం – కల్పవృక్ష వాహనం రాత్రి –         హనుమంత వాహనం

14-02-2024

ఉదయం – సూర్యప్రభ వాహనం                రాత్రి – చంద్రప్రభ వాహనం

15-02-2024

ఉద‌యం – సర్వభూపాల వాహనం           రాత్రి – కల్యాణోత్సవం, గరుడవాహనం

16-02-2024

ఉద‌యం – రథోత్సవం                                రాత్రి – గజ వాహనం

17-02-2024

ఉద‌యం – పల్లకీ ఉత్సవం                        రాత్రి – అశ్వ వాహనం

18-02-2024

ఉద‌యం – చక్రస్నానం,                              రాత్రి – ధ్వజావరోహణం

ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ ఆలయంలో కల్యాణోత్సవం రాత్రి 8 నుండి 10 గంటల వరకు వైభవంగా జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 19వ తేదీ ఆలయంలో పుష్పయాగం సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు ఘనంగా జరుగనుంది.

ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజు వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.