తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సనాతన ధార్మిక సదస్సుకు టిటిడి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది.
మూడు రోజుల పాటు జరగనున్న సనాతన ధార్మిక సదస్సులో దేశంలోని ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామిజీలు పాల్గొంటారు. సదస్సుకు విచ్చేసే స్వామీజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
టీటీడీ నిర్వహించే ధర్మ ప్రచార కార్యక్రమాలపై ఎస్వీబీసి వీడియో రూపొందిస్తోంది. సదస్సులో పాల్గొనే స్వామిజీల సలహాలు, సూచనలు తీసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.