కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు టీటీడీ దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా జరుగనున్నాయి.
ఉత్సవాల వివరాలు
- ఫిబ్రవరి 8న ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగరసంకీర్తన కార్యక్రమాలు, పురందర సాహిత్య గోష్ఠి, వివిధ పీఠాధిపతుల మంగళాశాసనాలు, మధ్యాహ్నం సంకీర్తనమాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- రెండవ రోజైన ఫిబ్రవరి 9న ఉదయం 6 గంటలకు అలిపిరి చెంత పురందరదాసుల విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తారు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి ఆలయం నుండి నారాయణగిరి ఉద్యానవనం వరకు శ్రీవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు, ఊంజల్‌సేవ, దాససంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి.
- చివరిరోజు ఫిబ్రవరి 10న ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన, హరిదాస రసరంజని కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- ఫిబ్రవరి 7న “శ్రీ వేంకటేశ్వర నవరత్న మాలిక”
- ఫిబ్రవరి 7న తిరుమలలోని కల్యాణవేదికలో యువ కళాకారులతో “శ్రీ వేంకటేశ్వర నవరత్న మాలిక” గోష్టిగానం నిర్వహించనున్నారు.
- కళాకారులకు “యువ ప్రతిభ పురస్కారాలు”
- సంగీత, నృత్య, వాద్య రంగాలలో నిష్ణాతులైన యువ కళాకారులకు ఈ ఏడాది మొదటిసారిగా టీటీడీ దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో “యువ ప్రతిభ పురస్కారాలు” అందజేస్తారు.
ఈ కార్యక్రమాల ఏర్పాట్లను టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు పర్యవేక్షిస్తున్నారు.