ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ రేపే

ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నట్టు దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం అధికారులు తెలియచేసారు. గురువారం ఉదయం 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డు వద్ద ఉన్న కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. ఈ గిరి ప్రదక్షిణ కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్‌, సితారా, కబేళా, పాలఫ్యాక్టరీ, చిట్టినగర్‌, కొత్తపేట, నెహ్రూబొమ్మ సెంటర్‌, బ్రాహ్మణ వీధి ద్వారా ఉదయం 9 గంటలకు మహామండపం వద్దకు చేరుకుంటుంది. 

సుమారు 7 కిలోమీటర్ల కాలినడకన ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ సాగుతుంది. భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అధికారులు కోరుతున్నారు.