ధర్మప్రచారంలో భాగంగా నవంబరు 20న తిరుపతి, 27న కర్నూలు, డిసెంబరు 4న విశాఖపట్నంలోను కార్తీక దీపోత్సవాలు నిర్వహించడానికి టిటిడీ ఏర్పాట్లు చేస్తోంది.
దాతల సహకారంతో ఈ మూడు ప్రాంతాల్లో కార్తీక దీపోత్సవాలునిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆయా జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం సహకారం తీసుకోవాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులతో సంప్రదించి దీపోత్సవానికి అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకోవాలని, ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, ఎక్కువ మంది భక్తులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు.