న‌వంబ‌రు 10న ఆన్‌లైన్‌లో 2.25 ల‌క్షల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు

  • డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 2.25 ల‌క్ష‌ల రూ.300/- దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 10వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్న‌ట్లు టీటీడీ తెలియచేసింది.   
  • వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. 
  •  తిరుప‌తిలోని తొమ్మిది కేంద్రాల‌లోని 100 కౌంట‌ర్ల‌లో డిసెంబ‌రు 22వ తేదీ వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులకు టైంస్లాట్‌ సర్వదర్శనం టోకెన్లు 4.25 లక్షలు విడుదల చేస్తారు. 
  • డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు ప్రత్యేక దర్శనాలైన చంటిపిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ఎన్‌ఆర్‌ఐల దర్శనాలు రద్దు చేసారు.
  • రోజుకు రెండు వేల‌ శ్రీవాణి టికెట్లు జారీచేయనున్నారు. 
  •  తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబ‌రు 23 నుండి 2024 జ‌న‌వ‌రి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం రోజుకు 2000 టికెట్లు చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
  • భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతోపాటు రూ.300/- దర్శన టిక్కెట్ కొనుగోలు చేయాలి. ఈ టికెట్లను పొందిన భక్తులకు మహా లఘు దర్శనం(జయ విజయుల వద్ద నుండి మాత్రమే) ఉంటుంది.

భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరడమైనది.