శాస్త్రోక్తంగా రుద్రహోమం

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి హోమం (రుద్ర‌హోమం) డిసెంబరు 1 శుక్రవారం రోజున శాస్త్రోక్తంగా ప్రారంభ‌మైంది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 1 నుండి 11వ తేదీ వ‌రకు 11 రోజుల పాటు ఈ హోమం నిర్వ‌హిస్తున్నారు. 

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ‌, రుద్ర‌జ‌పం, హోమం, ల‌ఘు పూర్ణాహుతి, నివేద‌న, హార‌తి నిర్వహిస్తారు. రోజూ సాయంత్రం పూజ‌, జ‌పం, హోమం, రుద్ర‌త్రిశ‌తి, బిల్వార్చ‌న‌, నివేద‌న‌, విశేష‌దీపారాధ‌న, హార‌తి సమర్పిస్తారు.