తిరుమలలోని గోకులం కార్యాలయంలో బుధవారం నుంచి ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టిక్కెట్ల జారీని టీటీడీ పునఃప్రారంభించింది.
ఫిబ్రవరి నెలలో ఇప్పటికే 750 టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కావున తిరుమలలో ఫిబ్రవరి 28వ తేదీ వరకు రోజుకు 150 శ్రీవాణి టికెట్లను జారీ చేయనున్నారు.
మార్చి నుండి, 1000 శ్రీవాణి టిక్కెట్లలో, 500 ఆన్‌లైన్‌లో, 400 తిరుమలలోని గోకులం కార్యాలయంలో, 100 తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద భక్తులకు అందుబాటులో ఉంటాయి.
టికెట్లు కావలసిన భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో హాజరైతేనే టికెట్లు జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆఫ్ లైన్ లో టికెట్లు పొందాలని టిటిడి తెలియచేస్తోంది.