ఆవుల‌ప‌ల్లె శ్రీ ప్రస‌న్న వేంక‌టేశ్వ‌ర‌‌ స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

 

 టీటీడీ ఆధీనంలోకి తీసుకున్న సోమ‌ల మండ‌లం ఆవుల‌ప‌ల్లెలోని శ్రీ ప్రస‌న్న వేంక‌టేశ్వ‌ర‌‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 9వ తేదీ వరకు వైభవోపేతంగా నిర్వహించనున్నారు.  ఇందుకోసం ఫిబ్రవరి 27న అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం, రాత్రి పలు వాహనాలపై స్వామివారు విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

వాహనసేవల వివరాలు 

  • 28-02-2023 – ధ్వజారోహణం – సూర్య‌ప్ర‌భ వాహ‌నం
  • 01-03-2023 – ప్రాతఃకాల ఉత్స‌వం –  హ‌నుమంత వాహనం
  • 02-03-2023 – ప్రాతఃకాల ఉత్స‌వం – సింహ వాహనం
  • 03-03-2023 – ప్రాతఃకాల ఉత్స‌వం   – శేష‌వాహనం
  • 04-03-2023 – ప్రాతఃకాల ఉత్స‌వం – మోహినీ ఉత్స‌వం, గ‌జ వాహ‌నం
  • 05-03-2023 – ప్రాతఃకాల ఉత్స‌వం –  క‌ల్యాణోత్స‌వం, గ‌రుడ‌సేవ‌           
  • 06-03-2023 – ప్రాతఃకాల ఉత్స‌వం – రథోత్సవం, డోలోత్స‌వం
  • 07-03-2023 – అశ్వ వాహ‌నం, పార్వేట ఉత్స‌వం – డోపు ఉత్స‌వం (తిరుమంగై ఆళ్వార్‌)
  • 08-03-2023 – వసంతోత్సవం, చక్రస్నానం – హంస వాహ‌నం, ధ్వజావరోహణం.