2023 సంవత్సరం కుసంబంధించి టీటీడీ ముద్రించిన 6 షీట్ల క్యాలండర్ ను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది.
తిరుమల లోని చైర్మన్ క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో జేఈవో తదితర అధికారులు పాల్గొన్నారు . గతఏడాది ముద్రించిన ఈ క్యాలండర్లకు డిమాండ్ ఎక్కువగా వచ్చినందువల్ల ముఖ్యమైన అన్ని నగరాల్లో విక్రయాలకు అందుబాటులో ఉంచాలని చైర్మన్ అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా, శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ క్యాలండర్లు తిరుమల,తిరుపతిలో భక్తులకు అందుబాటులో ఉంచుతారు. చెన్నై,బెంగుళూరు, హైదరాబాద్,ఢిల్లీ తదితర నగరాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లో రెండు రోజుల్లో విక్రయాలకు అందుబాటులో ఉంచుతారు.