మనింట్లో ఏ శుభకార్యం జరిగినా, పండుగల సమయంలోనైనా మహిళలు ఎంతో ఇష్టపడి గోరింటాకు అలంకరించుకుంటారు. ఈ గోరింటాకు సౌభాగ్యానికి, అందానికి చిహ్నంగా భావిస్తారు.
ఈ భూ ప్రపంచంలో చాలా రకాల చెట్లు, మొక్కలు ఉన్నా.. ఒక్క గోరింట మాత్రమే ఎందుకు పండుతోంది. ? దీనికి సంబంధించి పురణాల్లో ఓ కథే ఉంది. ఆకథేంటో మనమూ తెలుసుకుందామా..
గోరింటాకు కథ
రావణాసురుడిని సంహరించి.. రాముడు సీతమ్మ ను కాపాడి తన వెంట తీసుకొని వెళ్లేందుకు వచ్చినప్పుడు.. ఆమె ముఖం సంతోషంతో వెల్లివిరిసిందట. అప్పుడు సీతాదేవి రామునితో.. తాను లంకలో ఉన్నంత కాలం తన బాధలన్నిం టినీ గోరింట చెట్టుకు చెప్పుకున్నానని ... అందుకు గోరింటకు ఏదైనా చేయాలని కోరింది. ఇందులో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకోమని అడిగింది. అందుకు గోరింట.. ప్రస్తుతం సీతమ్మ మోము ఎంత అందంగా, సంతోషంగా కళకళలాడుతోందో...లోకంలోని మహిళలందరూ ఉండాలని కోరుకుంది. గోరింట కోరికను మన్నించిన సీతాదేవి.. ఎవరైతే గోరింట చెట్టును పూజించి.. వారి అర చేతులకు దాని ఆకులను పెట్టుకుంటారో.. వారికి సకల సంతోషాలు కలగి ఉంటారని వరాన్ని ప్రసాదించింది.
ఆకాలం నుంచి మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా మారింది. దీని వలన వధూవరులకు.. పెళ్లికి వచ్చిన వారికి కూ డా మంచి జరుగుతుందని నమ్మకం.