విశాఖపట్నంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు మార్చి 18 నుండి 23వ తేదీ వరకు జరుగనున్నాయి. మార్చి 23వ తేదీన ఉదయం 9 నుండి 11.30 గంటల వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు.
తేదీలవారీగా...
- మార్చి 18వ తేదీన శుక్రవారం రాత్రి 7 నుండి 10 గంటల వరకు ఆచార్య ఋత్విక్ వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు.
- మార్చి 19న శనివారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు యగాశాలవాస్తు, పంచగవ్య్రపాశనం, రక్షాబంధనం, అకల్మషహోమం, అక్షిమోచనం, బింబశుద్ధి, పంచగవ్యాధివాసం చేపడతారు. సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు అగ్నిప్రతిష్ట, కలశస్థాపన, కుంభావాహనం, కుంభారాధన, హోమం నిర్వహిస్తారు.
- మార్చి 20న ఆదివారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు హోమం, యాగశాల కార్యక్రమాలు చేపడతారు.
- మార్చి 21న సోమవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు హోమం, జలాధివాసం, యాగశాల కార్యక్రమాలు, రత్నన్యాసం, విమాన కలశస్థాపన, బింబస్థాపన, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు హోమం, యాగశాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- మార్చి 22న మంగళవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బింబవాస్తు, నవకలశ స్నపనం, చతుర్దశ కలశ స్నపనం, యాగశాల కార్యక్రమాలు, సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు మహాశాంతి తిరుమంజనం, రాత్రి 8 నుండి 10.30 గంటల వరకు రక్షాబంధనం, కుంభారాధనం, నివేదన, శయనాధివాసం, హౌత్రం, సర్వదేవతార్చన, హోమం, యాగశాల కార్యక్రమాలు చేపడతారు.
- మార్చి 23న బుధవారం ఉదయం 5.30 నుండి 8 గంటల వరకు కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి, ఉదయం 9 గంటల నుండి 11.30 గంటల వరకు కుంభాలను, ప్రధాన దేవతా విగ్రహాలను ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకొచ్చి ఉదయం 9.50 నుండి 10.20 గంటల మధ్య వృషభ లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆ తరువాత ధ్వజారోహణం, అర్చక బహుమానం అందిస్తారు. మధ్యాహ్నం 1.30 నుండి సాయంత్రం 6.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. సాయంత్రం 3 నుండి 4.15 గంటల వరకు కల్యాణోత్సవం జరుగనుంది. అనంతరం ధ్వజావరోహణం చేపడతారు. రాత్రి 7.30 నుండి 8.45 గంటల వరకు సర్వదర్శనం కల్పిస్తారు.