నృసింహ ద్వాదశి

చైత్రాది మాసాల క్రమంలో చిట్టచివరిది ఫాల్గుణమాసం. ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. మార్చి 15న నృసింహద్వాదశి. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన నృసింహస్వామిని ఈరోజున పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా ద్వాదశి నాటి గంగాస్నానం పాపనాశనమని పురాణ వచనం. ఈరోజున వైష్ణవాలయాల్లో ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించడం పుణ్యప్రదం. అలాగే మహిళలు సీతాదేవిని పూజించాలి. శ్రీ మహావిష్ణువునకు ప్రత్యేకపూజలు చేస్తే సకల సంపదలు చేకూరుతాయి. విష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో వచ్చే నృసింహ ద్వాదశికి ముందు నుండి 12 రోజులపాటు పయో వ్రతం ఆచరించి విష్ణుదేవునికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నృసింహద్వాదశి నాడు వైష్ణవాలయాలను సందర్శించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి.