మార్చి 4 నుంచి యాదాద్రి బ్ర‌హ్మోత్స‌వాలు

తెలంగాణ‌లోని యాదాద్రి లక్ష్మీన‌ర‌సింహ‌స్వామి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాల‌కు రంగం సిద్ధ‌మైంది. మార్చి 4 నుంచి బ్ర‌హ్మెత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌క‌టించింది. మార్చి 4 నుంచి 14 వ‌ర‌కు ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో భాగంగా మార్చి 11న బాలాల‌యంలో స్వామి వారి తిరు కళ్యాణం జ‌ర‌గ‌నుంది.