జగద్గురువు శంకరాచార్య జయంతి


కొన్ని శతాబ్దాల క్రిందట హిందూమతాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిన శక్తులను తరిమికొట్టి హిందూమతాన్ని ఉద్ధరించారు జగద్గురువులు శంకరాచార్యులవారు. 

అద్వైత మతాన్ని స్థాపించి కేవలం 32 ఏళ్ళ జీవితకాలంలోనే కొన్నివేల మైళ్ళు పాదచారిగా సంచరించి అనేక పీఠాలు స్థాపించారు. ఎంతో మంది శిష్యులకు జ్ఞానాన్ని అందించారు. ఇప్పటికీ ఆయన ప్రభ శృంగేరీపీఠంగా వెలుగొందుతోంది.

హిందూమతాన్ని ఉద్ధరించారు

788వ సంవత్సరంలో కేరళ ప్రాంతంలోని కాలడి లో జగద్గురువులు ఉదయించారు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. భారతదేశం అంతటా పాదయాత్రచేసి హిందూమతం యొక్క ఔన్నత్యాన్ని చాటారు. హిందూమతాన్ని నిర్వీర్యం చేయడానికి, ప్రజల దృష్టిలో హిందూమతాన్ని హింసామార్గంగా, కఠినమైనదిగా ప్రచారం చేసి బౌద్ధమతం తన ఉనికిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న కాలం అది. అనేక హిదూ మతగ్రంథాలు, దేవాలయాలు నాశనం చేయబడ్డాయి. హిందువులలోనే కొందరు మిడిమిడి జ్ఞానంతో ఆచారాలను తప్పుడుగా ప్రచారం చేసి, హిందూమతం మూర్ఖపు ఆచారాలతో ఉంటుందని ప్రచారం చేశారు. హిందూమతగ్రంథాలలో అసత్యాలను చొప్పించే ప్రయత్నం చేశారు. అప్పుడే ఆ పరమశివుని మరో రూపంగా శ్రీ శంకరాచార్యుల వారి అవతరించారు. అతి చిన్న వయసులోనే హిందూమతాన్ని ఉద్ధరించిన గురువులు తన 32వ ఏటనే శివైక్యం చెందారు.