శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ


తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా మంగ‌ళ‌వారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.









రెండో రోజు కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్య అర్చ‌న‌ చేపట్టారు. ఆ తరువాత ఉద‌యం 11.30 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంట వ‌ర‌కు పవిత్ర సమర్పణ నిర్వ‌హించారు. ఇందులో అమ్మ‌వారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, ప‌రివార దేవ‌త‌ల‌కు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు.





కాగా సాయంత్ర 6.00 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించనున్నారు.





Source