సెప్టెంబరు 10వ తేదీ నుండి గీతా పారాయణం


మానవాళికి భగవద్గీత సందేశాన్ని అందించాలన్న ఉన్నతాశయంతో సెప్టెంబర్ 10వ తేదీ నుండి తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గీతా పారాయణం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు గీతా పారాయణం శ్లోకపఠనం, వ్యాఖ్యానంతో ట్రయల్ రన్ నిర్వహించారు.





సుందరకాండ పారాయణం, విరాటపర్వం పారాయణం భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ఇదే తరహాలో గీతా పారాయణం నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఎస్వీబీసీలో ఈ పారాయణం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ప్రముఖ పండితులు శ్రీ కాశీపతి శ్లోక పారాయణం, శ్రీ కుప్పా విశ్వనాధ శాస్త్రి ప్రవచనం చెబుతారు. సెప్టెంబరు 3, 5వ తేదీల్లో రెండు విడతల్లో ట్రయల్ రన్ నిర్వహించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పారాయణం జరిగేందుకు టిటిడి చర్యలు చేపడుతోంది.





Source