స్వామివారి సంకల్పంతోనే తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగనున్నాయి. ఉద్ఘాటించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన రిషికేశ్ లోని విశాఖ శ్రీ శారద పీఠం ఆశ్రమంలో మూడు నెలలుగా చాతుర్మాస్య దీక్షలో ఉన్న విశాఖ శ్రీ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామిని టిటిడి అధికారులు కలిసి ఆయన ఆశీస్సులు పొందారు. స్వామీజీ వెంట శ్రీ శారద పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు ఉన్నారు. టీటీడీ చేపడుతున్న కరోనా వ్యాధి వ్యాప్తి నివారణ చర్యలను అభినందించారు.
ముఖ్యంగా, ఈ విపత్కర పరిస్థితులలో టీటీడీ చేపట్టిన అనేక ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సుందరకాండ, విరాటపర్వ పారాయణములు ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయన్నారు.
కరోనా సమయంలో అర్చకులకు, భక్తులకు, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ నెలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి బోర్డు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. అక్టోబరులో కరోనా తీవ్రతను, అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భక్తులకు కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుని, నవరాత్రి బ్రహ్మోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని సూచించారు.