శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు


తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జ‌రుగ‌నున్న పవిత్రోత్సవాలు జూలై 2 గురువారం నుంచి ప్రారంభ‌మ‌య్యాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించారు.





ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉద‌యం పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, ప‌సుపు, గంధం త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో స్న‌ప‌న‌తిరుమంజ‌నం చేప‌ట్టారు. ‌సాయంత్రం క‌ల‌శ‌పూజ‌, హోమం, ప‌విత్ర ప్ర‌తిష్ఠ నిర్వ‌హించారు.





కపిలేశ్వరస్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ





తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల్లో రెండో రోజైన శుక్ర‌వారం స్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ జరిగింది. ఇందులో భాగంగా ఉద‌యం హోమం, గ్రంథి పవిత్ర సమర్పణ చేపట్టారు. సాయంత్రం యాగ‌శాల‌పూజ‌, హోమం నిర్వ‌హించారు.





Source