తిరుచానూరులో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. కోవిడ్-19 నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహిస్తున్న విషయం విదితమే.
ఇందులో భాగంగా మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల వరకుశ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం ఇతర సుగంధ ద్రవ్యాలతో ఉత్సవర్లకు అభిషేకం చేశారు.