అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజున వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. ఆనంతరం స్వామివారి ఆస్థానం జరిగింది.
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా ఈ ఏడాది వాహనసేవల ఊరేగింపును రద్దు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో తిరుచ్చి ఉత్సవం ఏకాంతంగా నిర్వహిస్తారు.
జూన్ 5న సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం ఏకాంతంగా, వైభోగంగా, ఆగమోక్తంగా నిర్వహించారు. అదేవిధంగా జూన్ 10న ఉదయం 9.30 నుండి 10 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా గంగాళంలో చక్రస్నానం నిర్వహిస్తారు.