శ్రీవారి దర్శనార్థం తిరుపతిలోని కౌంటర్లలో జారీ చేస్తున్న టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్ల కోటా జూన్ 26వ తేదీ వరకు పూర్తయింది.
కోవిడ్-19 నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల కోసం దూరప్రాంతాల నుంచి భక్తులు తిరుపతికి వచ్చి రోజుల తరబడి వేచి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో దర్శన టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.
టిటిడి అధికారులు సమీక్షించిన అనంతరం జూన్ 27వ తేదీ, ఆ తరువాత కేటాయించే టోకెన్ల గురించి తెలియజేస్తారు.