చంద్రగిరిలోని శ్రీ మూలస్థాన ఎల్లమ్మకు శుక్రవారం మధ్యాహ్నం టిటిడి తరఫున సారె సమర్పించారు. అంతకుముందు తిరుమల శ్రీవారి ఆలయం నుండి వచ్చిన సారెను చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆ తరువాత శేషవస్త్రాలు, పసుపు కుంకుమ తదితర మంగళద్రవ్యాలతో కూడిన సారెను మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించారు.