కోసువారిపల్లి శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు వైభవోపేతంగా నిర్వహించనున్నారు. టిటిడి అనుబంధ ఆలయాల్లో ఒకటైన కోసువారిపల్లి ఆలయ బ్రహ్మోత్సవాలు 25వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమవుతాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు
తేదీ ఉదయం రాత్రి
26-01-2020(ఆదివారం) ధ్వజారోహణం పల్లకీ ఉత్సవం
27-01-2020(సోమవారం) పెద్దశేషవాహనం హంసవాహనం
28-01-2020(మంగళవారం) ముత్యపుపందిరి వాహనం సింహవాహనం
29-01-2020(బుధవారం) కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం
30-02-2020(గురువారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
31-02-2020(శుక్రవారం) సర్వభూపాల వాహనం కల్యాణోత్సవం, గరుడవాహనం
01-02-2020(శనివారం) రథోత్సవం గజ వాహనం
02-02-2020(ఆదివారం) పల్లకీ ఉత్సవం అశ్వ వాహనం
03-02-2020(సోమవారం) చక్రస్నానం, ధ్వజావరోహణం
కాగా జనవరి 31వ తేదీ శుక్రవారం ఆలయంలో కల్యాణోత్సవం రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు వైభవంగా జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం ఆలయంలో పుష్పయాగం సాయంత్రం 5.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు ఘనంగా జరుగనుంది.
ఉత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.