తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఐదు రోజులపాటు జరుగనున్న తెప్పోత్సవాలు ఆదివారం సాయంత్రం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు కపిలతీర్థంలో తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.
విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై మొదటిరోజు శ్రీవినాయకస్వామివారు ఐదు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసారు. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు.
అదేవిధంగా సోమవారం శ్రీ సుబ్రమణ్యస్వామివారు తెప్పలపై ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు.