క్వీన్ ఆఫ్ గాడ్స్ ఓన్ ల్యాండ్ మున్నార్ విశేషాలు


కేరళలో ఉన్న అత్యంత ప్రముఖమైన వేసవి-విడిది పట్టణాలలో మున్నార్ ఒకటి. పశ్చిమ కనుమల మీద ఉన్న ఇదుక్కి జిల్లాలో మున్నార్ ఉంది. కేరళ రాష్ట్ర పర్యటనలో మున్నార్ ప్రదేశం ఒక మంచి పర్యాటక ప్రదేశం. ఇండియాలో అత్యధిక సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రదేశానికి వస్తున్నారు. మున్నార్ ని 'క్వీన్ అఫ్ గాడ్స్ ఓన్ ల్యాండ్ ' అంటారు. నిజంగానే ఈ ప్రదేశం భూతల స్వర్గమే.





మున్నార్‌, మూతిరపుళా, నల్లతన్ని మరియు కుండాల అనే మూడు పర్వతా వాగులు సంగమంలో ఉంది. సముద్ర మట్టానికి 1600మీటర్ల ఎత్తులో ఉన్న మున్నార్‌ ఒకప్పుడు బ్రిటిష్‌ పరిపాలకులకు దక్షిణ భారతదేశంలోని ఒక వేసవి రిసార్ట్‌. విశాలమైన టీ తోటలు, అందమైన పట్టనాలు, వైండింగ్ లైన్‌లు మరియు హాలిడే సదుపాయాలు దీనిని ఒక ప్రముఖ రిసార్ట్ టౌన్‌గా మార్చాయి. ఈ అడవులు మరియు గడ్డిమైదానాల్లో కనిపించే అద్భుతమైన పుష్ప సంపదలో నీలకురింజి ఒకటి. ఈ పువ్వు ఈ కొండల్లో 12 సంవత్సరాలకు ఒక్కసారి పూస్తుంది. మున్నారులో దక్షిణభారతదేశంలోనే అతి ఎత్తైన పర్వతశిఖర, ఆనముడి ఉంది, దీని ఎత్తు 2,695మీ. ఆనముడి ట్రెక్కింగ్‌కు ఎంతో అనకూలమైనది.





కేరళకు వచ్చే ఏ పర్యాటకుడైనా సరే, మున్నార్ తప్పక చూడవలసిందే. అక్కడ కల దృశ్యాలు, వాతావరణం వారిని కట్టి పడేస్తాయి. పడమటి కనుమలలో వున్న మున్నార్ కు సరిహద్దులుగా పచ్చటి పర్వత ప్రదేశాలు, తేయాకు తోటలు కలవు. మున్నార్ కు అర్ధం చెప్పాలంటే, మూడు నదులు అని అర్ధం. అవి మధుర పూజ, నల్లతాని మరియు కుండలి. ఈ మూడు నదులు ఈ ప్రాంతం లో కలుస్తాయి. కేరళ లోని ఇడుక్కి జిల్లాలో మున్నార్ ప్రధాన పర్యాటక ప్రదేశం.





మున్నార్ ను పూర్తిగా చూసే సమయం లేదనుకుంటే, ఇక్కడ మేము అందిస్తున్న ప్రదేశాలను మాత్రం తప్పక చూడండి. సమీప రైల్వేస్టేషను ఎర్నాకుళం మరియు అలువాలో ఉంది (దాదాపు 110కిమీ దూరం రోడ్డు రహదారిలో ఉంది). 105కిమీ దూరంలో ఉన్న కొచిన్ అంతర్జాతీయ విమానాశ్రయం దీనికి సమీపంలో ఉన్న విమానాశ్రయం.









కేరళలోని మున్నార్ లో చూడవలసిన ప్రదేశాలు





  1. ఫోటో పాయింట్
    మున్నార్ నుండి 3 కి. మీ. ల దూరంలో వున్న ఫోటో పాయింట్ లో మీకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టముంటే ఈ ప్రదేశంలో వున్న అడవులు, మరియు నీటి ప్రవాహాలు, జలపాతాలను మీ కెమేరాలో బందించవచ్చును. ఈ ప్రదేశం మట్టుపెట్టికి వెళ్ళే మార్గంలో కలదు. పచ్చటి అడవులు, గల గల పారే ప్రవాహాలు, పచ్చటి కొండలు వంటివి ఎన్నో ప్రదేశాలు చూడవచ్చు.
  2. ఎకో పాయింట్
    మున్నార్ నుండి 15 కి. మీ.ల దూరంలో వున్న ఎకో పాయింట్ కొన్ని కొండల మధ్య వున్న చిన్న ప్రదేశం. సహజమైన ఈ ప్రతిధ్వని ప్రదేశం మీరు ఎంత బిగ్గరగా అరిస్తే అదే రీతిలో మరల సౌండ్ అలలతో మీ వద్దకు వచ్చి వినపడుతుంది. ఆసక్తి కల యువత గ్రూప్ లు గా ఈ ఎకో పాయింట్ కు వచ్చి రకరకాల ధ్వనులు చేసి ఆనందస్తారు. 3. ఏనుగుల ప్రదేశం మున్నార్ నుండి 18 కి. మీ.ల దూరంలో వున్న ఈ ప్రదేశంలో మీరు ఏనుగుపై సవారి చేయవచ్చు. దానితో పాటు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేసే మున్నార్ కొండలు, టీ తోటలు కూడా చూసి ఆనందించవచ్చు. పచ్చటి మైదానాలలో నడిచి ఆనందించవచ్చు.
  3. ఎరావికులం
    మున్నారు పక్కన ప్రధాన ఆకర్షణ ఎరవికులం నేషనల్‌ పార్క్‌ అని చెప్పవచ్చు. ఇది అంతరించిపోతున్న నీలగిరి తార్‌కు ఫేమస్‌. 97 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ పార్కు అనేక రకాల అరుదైన సీతాకోక చిలుకలు, జంతువు మరియు పక్షులకు కేంద్రం. ఇది ట్రెక్కింగ్‌కు గొప్పస్థలం, పార్కులో నుంచి టీతోలు, ఆపై తుషార బిందువుల దుప్పటిని కప్పుకున్న కొండల యొక్క అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించవచ్చు. ఇక్కడ సుమారు 26 రకాల వన్య జంతువులను, 132 రకాల పక్షులను చూడవచ్చు. అంతేకాకుండా ఎరావికులం నేషనల్ పార్క్ లో మీరు నేడు కనుమరుగు అవుతున్న నీలగిరి తార జింకలను చూడవచ్చు. నేషనల్ పార్క్ చూచుటకు అనుకూల సమయం జనవరి - ఫిబ్రవరి నెలలు సందర్శనకు పార్క్ లోపలికి అనుమతించరు. వర్షాకాలంలో వన్య జీవులకు సంతానోత్పత్తి సమయం. కనుక ఈ సమయంలో నేషనల్ పార్క్ యాజమాన్యం సందర్శకులను పార్క్ లోపలికి అనుమతించరు.
  4. రాజమల ఎరావికులం నేషనల్ పార్క్ సమీపంలో వున్న రాజమలలో నీలగిరి థార్ జింకలను చూడవచ్చును. హనీ మూన్ జంటలకు ఇది ఒక మంచి ప్రదేశం. రాజమలకు చుట్టూ పచ్చటి పర్వత శ్రేణులు ఎత్తుగా వుండి ప్రకృతి ప్రియులను రంజింప చేస్తుంది. ఫ్యామిలీ ట్రిప్ లు, విద్యార్ధుల ఎక్స్ కర్షన్ లకు కూడా బాగుంటుంది. సాహస ప్రియులకు ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేయవచ్చును.




ఆనముడి పర్వతశిఖరం
ఎరవికులం నేషనల్‌ పార్కులోపల ఉన్నది ఆనముడి పర్వతశిఖరం. దక్షిణ భారతదేశంలోనే ఇది అతి పెద్ద పర్వతశిఖరం, ఇది సుమారు 2700 మీటర్ల ఎత్తున ఉన్నది. ఈ పర్వతశిఖంపై ట్రెక్కింగ్‌ చేయడానికి ఎరవికులంలోని ఫారెస్ట్‌ మరియు వన్య సంరక్షణ అధికారుల యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.





మట్టుపెట్టి
సందర్శకుల దృష్టిని ఆకర్షించే మరో ఆసక్తికర ప్రదేశం, మున్నారు పట్టణం నుంచి 13కిలోమీటర్ల దూరంలో ఉన్న మట్టుపెట్టి. ఇది సముద్రమట్టానికి 1700మీటర్ల ఎత్తులో ఉన్నది, మట్టుపెట్టి స్టోరేజీ డ్యామ్‌ మరియు అందమైన చెరువు ఉన్నాయి. ఇందులో అద్భుతమైన బోటు రైడిరగ్‌కు అనుమతిస్తారు, పక్కన ఉన్న కొండలు మరియు లాండ్‌ స్కేప్‌లను ఆస్వాదించవచ్చు. మట్టుపెట్టిలో నడపబడే ఇండో స్విస్‌ లైవ్‌ స్టాక్‌ ప్రాజెక్ట్‌ కింద నడపబడే డైరీ ఫాం ఎంతో ప్రముఖమైనది, ఇక్కడ అత్యంత దిగుబడి ఇచ్చే ఆవుల్లో చూడవచ్చు.





పల్లివాసల్‌
పల్లివాసల్‌, ఇది మున్నారు నుంచి చిత్తిరపురం నుంచి 3కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది కేరళలోని మొదటి హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్‌కు వేదిక. ఇది అద్భుతమైన దృశ్య సౌందర్యానికి కేంద్రం మరియు సందర్శకులు దీన్ని ఒక ప్రముఖ పిక్నిక్‌కేంద్రంగా పరిగణిస్తున్నారు.





ఎకో పాయింట్ మున్నార్ లో ఎకో పాయింట్ ఒక విశిష్టమైన పర్యాటక ఆకర్షణ. ఈ ప్రదేశం మున్నార్ కు 13 కి. మీ. ల దూరంలో కలదు. ఇది ఒక నది ఒడ్డున కలదు. ఇక్కడ మీరు చప్పట్లు చరిస్తే వాటి ప్రతి ధ్వని ఎంతో బాగా వినిపిస్తుంది.





చిన్నకనాల్ మరియు ఆనయీరంగల్‌
మున్నారుకు దగ్గరల్లో చిన్నకనాల్‌ ఉంటుంది మరియు ఇక్కడ ఉండే వాటర్‌ ఫాల్స్‌ను పవర్‌ హౌస్‌ వాటర్‌ ఫాల్స్‌ అని అంటారు. ఇక్కడ నిట్టనిలువుగా ఉండే రాళ్లు సముద్ర మట్టానికి 2000మీటర్ల ఎత్తుగా ఉంది. ఈ ప్రదేశం, పశ్చిమఘాట్‌ శ్రేణిలోని అందమైన దృశ్యాలకు కేంద్రంగా ఉంటుంది. చిన్నకనాల్‌ నుంచి ఏడు కిలోమీటర్ల ప్రయాణిస్తే మీరు ఆనయీరంగల్‌ చేరుకుంటారు. మున్నార్‌ నుంచి 22కిలోమీటర్ల దూరంలో ఉండే ఆనయీరంగల్‌, టీ తోటలతో పచ్చనికార్పెట్‌లా ఉంటుంది. అద్భుతమైన రిజర్వాయర్‌పై ట్రిప్పు ఒక మరపురాని అనుభూతిని మిగిలిస్తుంది. ఆనయీరంగల్‌ డ్యామ్‌ చుట్టుపక్కల టీ తోటలు మరియు పచ్చని అడవులుంటాయి.





టాప్ స్టేషన్
టాప్ స్టేషన్, మున్నారు నుంచి 3కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1700 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మున్నార్- కొడైకనాల్ రోడ్డులో ఇది గరిష్ట స్థానం. మున్నారును సందర్శించే సందర్శకులు తప్పనిసరిగా టాప్‌ స్టేషన్‌ను సందర్శించాల్సిందే. ఇక్కడ నుంచి పొరుగున్న తమిళనాడు రాష్ట్రం యొక్క అందాలను ఆస్వాదించవచ్చు. ఎంతో విశాలమైనప్రాంతంలో విరబూసే నీలకురింజి పుష్పాలను చూడటం కోసం మున్నారులో ఇది ఎంతో అనుకూలమైన ప్రదేశం.









టీ మ్యూజియం
టీ తోటల ఆవిర్భావం మరియు వృద్ధికి సంబంధించి మున్నారుకు ఘనమైన పూర్వ చరిత్రే ఉన్నది. ఈ పూర్వ చరిత్రను సంరక్షించడం కోసం మరియు కేరళ గరిష్ట ఎత్తుల్లో సాగించే టీ తోగల సాగులోని ఆసక్తికరమైన అంశాలను ప్రపంచవానికి తెలియచేయడం కోసం మున్నారులో టాటా టీ ద్వారా టీ కొరకు ప్రత్యేకమైన ఒక మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఈ టీ మ్యూజియంలో అనేక ఆసక్తికరమైన వస్తువులు, ఫోటోగ్రాఫ్‌లు మరియు యంత్రాలున్నాయి. ఇవీన్న కూడా మున్నారు ప్రాంతంలో టీ తోటల యొక్క అభివృద్ధికిసంబంధించి మనకు అనేక కథలు చెబుతాయి. మున్నారులోని టాటా టీకి చెందిన నల్లతన్ని ఎస్టేటులో ఉన్న ఈ మ్యూజియంను తప్పక సందర్శించాల్సిందే.





అక్కడకు చేరుకోవడం ఎలా?





మున్నార్‌కు దగ్గరల్లో ఉన్న రైల్వే స్టేషన్ అలువా. సుమారు 108 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది మరో స్టేషన్ అంగమలి ఇది సుమారు 109 కిలోమీటర్లు దూరంలో ఉంది.





మున్నార్‌కు దగ్గరల్లోని ఎయిర్‌పోర్ట్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్. అలువా- మున్నార్ రోడ్డులో సుమారు 108 కిలోమీటర్లు దూరాన ఇది ఉంది. ఈ ప్రాంతాల నుండి మున్నార్‌కు విరివిగా ట్రాన్సుపోర్టు వాహనాలు లభిస్తాయి.