గ్రహణసమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. పాటించకపోతే శారీరక సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని ఒక రీసెర్చి ద్వారా కూాడా తెలిసింది. డిసెంబరు 26న సూర్యగ్రహణం ఏర్పడనుంది.
గ్రహణ ప్రభావాలపై రీసెర్చ్
గ్రహణానికి కొన్ని గంటల ముందు నుంచే ఉపవాసం ఉండాలి. ఎందువల్లనంటే ఆ సమయంలో సూర్యుడి నుంచి వచ్చే కిరణాల వల్ల నీరు కలుషితమవుతుందని విక్రమ్ సారాభాయ్ రిసెర్చ్ సెంటర్ పరిశోధనలో తేలింది. ఇలా కలుషితమైన నీటిని శుద్ధిచేసే గుణం దర్భలకు ఉందని ఈ పరిశోధనలో గుర్తించారు. దర్భలలో శ్రేష్టమైన ఔషధ గుణాలు ఉన్నాయని శాస్త్రీయంగా రుజువుచేశారు. గ్రహణ సమయంలో వెలువడే అతినీల లోహిత కిరణాల తీవ్రతను దర్బలు తులసి దళాలల కంటే ఎక్కువుగా నిరోధిస్తాయని తెలిసింది.
గ్రహణప్రభావం ఆరోగ్యంపై ఎలా ఉంటుంది?
గ్రహణసమయంలో సూర్య కిరణాలలోని మార్పులు అనూహ్యంగా చోటు చేసుకుంటాయి. దీని ప్రభావం జీర్ణవ్యవస్థపై అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో జంతువులు కూడా ఆహారం ముట్టవని జైపూర్ జంతు ప్రదర్శనశాల పరిశోధనలో వెల్లడయ్యింది. ప్రకృతిపరంగా ఏర్పడిన ఈ మార్పుకు జంతువులు సైతం నియమాలు పాటిస్తున్నప్పుడు తెలివైన మానవుడు దీనికి భిన్నంగా ప్రవర్తించడం సబబు కాదు. గ్రహణ సమయంలో కిరణాల ప్రభావం వల్ల శరీరంలోని మార్పులకు అనుగుణంగా ఆహారం స్వీకరించపోవడమే మంచిదని పెద్దలు చెబుతారు. ఆ క్షణంలో మార్పు కనిపించకపోయినా దాని ప్రభావం తప్పకుండ ఉంటుంది.
గ్రహణ సమయంలో ఏం చేయాలి?
ఆగమ శాస్త్రం ప్రకారం.. గ్రహణ సమయంలో దేవాలయాల్ని మూసి, తర్వాత సంప్రోక్షణ చేసి పూజలు ప్రారంభించాలి. అందుకే దేవాలయాలు మూసివేస్తారు. గ్రహణం సమయంలో చేసే మానసిక జపం మామూలుగా చేసే దానికన్నా ఎక్కువ ఫలితాన్నిస్తుందంటారు. గ్రహణ సమయంలో ఆవు నేతితో దీపారాధన చేసి, దాని ముందు కూర్చుని జపం చేస్తే హోమం చేసినంత ఫలితం. అయితే అందరూ ఈ జపాలు చేయలేరు. ఉద్యోగ రీత్యా, వ్యక్తిగత కారణాల వల్ల కుదరకపోవచ్చు. అలాంటివారు శాస్త్రం ప్రకారం సూర్య గ్రహణానికి కొన్ని గంటల ముందు నుంచి కడుపు ఖాళీగా ఉంచాలి. ఈ సమయంలో ఏమైనా తినటంవల్ల అనారోగ్యానికి గురవుతారు.