తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి మంగళవారం మహంతు ఉత్సవం వేడుకగా జరిగింది.
ముందుగా ఆలయం నుండి శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లను తిరుచానూరులోని శ్రీ సీతారామ కల్యాణమండపం వద్దగల శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు వేంచేపు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి పలురకాల సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఈ సందర్భంగా హథీరాంజీ మఠం మహంతు శ్రీ అర్జున్‌దాస్ అమ్మవారి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తరువాత పల్లకీపై అమ్మవారిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు.