శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రెండవ రోజైన గురువారం అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగంలో వైభవంగా జరిగింది. ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా గురువారం ఉదయం 9.00 గంలకు ప్రధాన కంకణబట్టార్ శ్రీ సీతారామాచార్యులు ఆధ్వర్యంలో కుంభారాధన, గో పూజ, ఉక్త హోమాలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కోబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
కాగా, అక్టోబరు 18న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు గజపూజ, పూర్ణాహుతితో మహాయాగం ముగిసింది.