టిటిడి అనుబంధ శైవాలయాల్లో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు


టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీ‌పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా, నాయుడుపేట మండలం, తుమ్మూరు గ్రామంలోని శ్రీ క‌రియ‌మాణిక్య‌స్వామి, శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆల‌యంలో ఆదివారం శ్రీ దేవి న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ఘ‌నంగా జరుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా అంకురార్ప‌ణ‌, క‌ల‌శ‌స్థాప‌న నిర్వ‌హించారు. సాయంత్రం శ్రీ పార్వ‌తిదేవి అలంకారంలో అమ్మ‌వారు ద‌ర్శ‌న‌మిచ్చారు.





అదేవిధంగా, సెప్టెంబ‌రు 30న శ్రీ బాలా త్రిపుర‌సుంద‌రి, అక్టోబ‌రు 1న శ్రీ ల‌లితా త్రిపుర‌సుంద‌రి, అక్టోబ‌రు 2న శ్రీ‌మ‌హాల‌క్ష్మి, అక్టోబ‌రు 3న శ్రీ అన్న‌పూర్ణా దేవి, అక్టోబ‌రు 4న శ్రీ గాయ‌త్రిదేవి అలంకారాల్లో అమ్మవారు భక్తులను కరుణించారు.





అక్టోబ‌రు 5న శ్రీ స‌ర‌స్వ‌తిదేవి, అక్టోబ‌రు 6న శ్రీ దుర్గాదేవి, అక్టోబ‌రు 7న శ్రీ మ‌హిషాసురమ‌ర్ధిని, అక్టోబ‌రు 8న శ్రీ రాజ‌రాజేశ్వ‌రి అలంకారాల్లో అమ్మ‌వారు ద‌ర్శ‌న‌మిస్తారు.





శేషాపురంలోని శేషాచల లింగేశ్వరస్వామి ఆలయంలో...





టిటిడికి అనుబంధంగా ఉన్న చంద్ర‌గిరి మండ‌లం శేషాపురం గ్రామంలోని శ్రీ శేషాచ‌ల లింగేశ్వ‌రస్వామివారి ఆల‌యంలో శ్రీ ఉమామ‌హేశ్వ‌రి అమ్మ‌వారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ప‌ది రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మ‌వారు భక్తులకు దర్శనమిస్తారు.





ఇందులో భాగంగా సెప్టెంబరు 29న శ్రీ ఉమామ‌హేశ్వ‌రి దేవి, సెప్టెంబరు 30న శ్రీ బాలాత్రిపుర సుంద‌రి దేవి, అక్టోబరు 1న శ్రీ గాయ‌త్రిదేవి, అక్టోబరు 2న శ్రీ అన్నపూర్ణాదేవి, అక్టోబరు 3న శ్రీ ల‌లితాదేవి అలంకారాల్లో అమ్మ దర్శనమిచ్చింది. అక్టోబరు 4న శ్రీ సరస్వతి దేవి, అక్టోబరు 5న శ్రీ మ‌హాలక్ష్మీదేవి, అక్టోబరు 6న శ్రీ దుర్గాదేవి, అక్టోబరు 7న మహిషాసురమర్థిని, అక్టోబరు 8న శ్రీ రాజ‌రాజేశ్వ‌రి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. చివరిరోజు దుర్గా హోమం నిర్వ‌హిస్తారు.





ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దేవి భాగవతంపై పురాణ ప్రవచనం, లలితసహస్రనామ పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.