తిరుపతిలోని కపిలేశ్వరస్వామి ఆలయంలో కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు అలంకార మండపంలో సోమస్కంధమూర్తి, కామాక్షి అమ్మవారు, వినాయకస్వామి, శ్రీ చండికేశ్వరస్వామి, వల్లిదేవయాని సమేత సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. ఈ ఉత్సవమూర్తులను వేంచేపుగా ఊంజల్ మండపానికి తీసుకొచ్చి వేదమంత్రోచ్చారణ, శంఖనాదాలు, శివనామస్మరణల మధ్య ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ధ్వజస్తంభానికి పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పళ్లరసాలతో అభిషేకించారు. అనంతరం బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు వైభవంగా జరిపారు. ఉదయం 7.19గంటలకు కుంభలగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటాన్ని స్తంభంపై అధిరోహింపచేశారు. అనంతరం కామాక్షి సమేత సోమస్కంధమూర్తిని తిరువీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం హంసవాహనంపై స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులు తిరు వీధుల్లో ఊరేగారు.
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన బుధవారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు కామాక్షి అమ్మవారి సమేతంగా సోమస్కందమూర్తిగా భూత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. పూర్వం క్రూరభూతాలు ప్రజలను బాధిస్తున్న వేళ పరమశివుని బ్రహ్మదేవుడు ఆ భూతాలను నిగ్రహించి లోకాలను కాపాడమని వేడుకొన్నాడు. ఈ కార్యానికి నిర్జన దేశమైన శ్మశానాలను తన అనంతరం ఉదయం 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీ స్కోమస్కందమూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.
సింహ వాహనం
బుధవారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సింహ వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేసారు. మృగరాజు సింహం. దేవతల్లో అత్యంత ఉత్కృష్టుడు పరమేశ్వరుడు. భక్తుల హృదయం గుహ వంటిది. ఆ గుహలో సింహం వంటి ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంచుకుంటే జీవుడు ఏ భయాన్ని పొందడు. మృగరాజు వంటి శివపరమాత్మ కొలువై అభయమిచ్చి జీవనాన్ని పాలిస్తుంటే, అరిషడ్వర్గాలనే క్షుద్ర మృగాల భయం ఉండదు.
మకర వాహనంపై కపిలతీర్థ విభుడు
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. వాహనసేవలో భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి.
మకరం గంగాదేవికి నిత్యవాహనం. గంగ పరమశివుని శిరస్సుపై నివసిస్తోంది. గంగాదేవి వాహనమైన మకరం తపమాచరించి శివానుగ్రహాన్ని పొంది ఆ పరమశివునికి వాహనమైందని శైవాగమాలు తెలియజేస్తున్నాయి. మకరం జీవప్రకృతికి ఉదాహరణ. భగవంతుని ఆశ్రయించినంత వరకు జీవుడు నీటిలో మొసలిలా బలపరాక్రమంతో జీవించవచ్చు.
అనంతరం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.