2019 మార్చి నెల‌లో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ఉత్స‌వాలు


కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో నిత్య కల్యాణం పచ్చతోరణంగా ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇందులోభాగంగా మార్చి నెలలో జరుగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.





  • మార్చి 2న మ‌త‌త్ర‌య ఏకాద‌శి.
  • మార్చి 4న మ‌హాశివ‌రాత్రి.
  • మార్చి 14న శ్రీ తిరుక్క‌చ్చినంబి శాత్తుమొర‌.
  • మార్చి 16 నుండి 20వ తేదీ వ‌రకు శ్రీ‌వారి వార్షిక తెప్పోత్స‌వాలు.
  • మార్చి 17న సర్వ ఏకాద‌శి.
  • మార్చి 20న హోళీ, తుంబురుతీర్థ ముక్కోటి.
  • మార్చి 21న శ్రీ శాల‌నాచ్చియార్ శాత్తుమొర‌, శ్రీ ల‌క్ష్మీ జ‌యంతి.
  • మార్చి 31న స్మార్త ఏకాద‌శి.