ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని ఆలయంలో ఏప్రిల్‌ 13 నుండి బ్రహ్మోత్సవాలు


కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 13 నుండి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టిటిడి ప్రకటించింది. ఏప్రిల్‌ 13న ధ్వజారోహణం, పోతన జయంతి, 16న హనుమంత వాహనం, 18న సీతారాముల కల్యాణం, 19న రథోత్సవం, 21న చక్రస్నానం, 22న పుష్పయాగం జరుగనున్నాయి. ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. సీతారాముల కల్యాణానికి విస్త్ర‌త ఏర్పాట్లు చేసేందుకు టిటిడి చర్యలు తీసుకుంటోంది.





బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు ఇవే..





తేదీ ఉదయం రాత్రి





  • 13-04-2019(శని) ధ్వజారోహణం(ఉ|| 8-9గం||ల) పోతన జయంతి, శేషవాహనం.
  • 14-04-2019(ఆది) వేణుగాన అలంకారం హంస వాహనం
  • 15-04-2019(సోమ) వటపత్రసాయి అలంకారం సింహ వాహనం
  • 16-04-2019(మంగళ) నవనీతకృష్ణ అలంకారం హనుమంత వాహనం
  • 17-04-2019(బుధ) మోహినీ అలంకారం గరుడసేవ
  • 18-04-2019(గురు) శివధనుర్భాణ అలంకారం శ్రీ సీతారాముల కల్యాణం (రా|| 8 గం||లకు), గజవాహనం
  • 19-04-2019(శుక్ర) రథోత్సవం
  • 20-04-2019(శని) కాళీయమర్ధన అలంకారం అశ్వవాహనం
  • 21-04-2019(ఆది) చక్రస్నానం ధ్వజావరోహణం(రా|| 7 గం||)
  • 22-04-2019(సోమ) పుష్పయాగం(సా|| 6 గం||)