శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి వైభవంగా పవిత్రోత్సవాలు

అప్పలాయగుంట లోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రెండో రోజైన శనివారం పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేశారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమలసేవ, కొలువు, అర్చన నిర్వహించారు.

అనంతరం రాత్రి 7.00 నుండి 9.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, రక్షాబంధనం, కుంభరాధనం నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ చేసారు.

Source